ఆలయ అభివృద్ధికి సమిష్టి కృషి.. ఎమ్మెల్సీ

Update: 2022-03-01 09:31 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన చిల్పూర్, వేలేరు  మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా రెండవ తిరుపతిగా పేరున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కావలసిన నిధుల మంజూరు కోసం సమిష్టిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుద్దాం అన్నారు.

రోడ్లు, సులబ్ కాంప్లెక్స్, గుట్ట పైకి మెట్లు, ఘాట్ రోడ్, పార్కింగ్ మొదలైన పనుల కోసం రూ.10 కోట్లు మంజూరు చేయించి ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం అన్నారు. దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య, చైర్మన్ సంపత్ రెడ్డి, ఎంపీపీ సరిత బాలరాజు, సర్పంచ్ రాజ్ కుమార్, వేలేరు జెడ్ పి టి సి సరిత, కూడా డైరెక్టర్ కుమార్, రంజిత్ రెడ్డి, అర్చకులు రంగాచార్యులు, రవి శర్మ, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు మహా శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News