'గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్' ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్ డివిజన్‌లోని నక్కనదొడ్డి స్టేషన్ వద్ద ‘గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్’ ప్రారంభించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్ డివిజన్‌లోని నక్కనదొడ్డి స్టేషన్ వద్ద 'గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్' ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే కార్గో నిర్వహణలో అదనంగా టెర్మినల్‌ను అభివృద్ధి చేయడంలో పరిశ్రమల నుంచి పెట్టుబడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే నూతన గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) విధానం ప్రవేశపెట్టిందని, సరుకులను భద్రంగా, సురక్షితంగా రైళ్లలో రవాణా చేయడానికి ఈ టెర్మినల్‌లు ఉపయోగపడుతాయని అధికారులు తెలిపారు.
ఈ విధానంలో నూతన సైడింగ్స్‌లే కాకుండా నిర్మాణంలో ఉన్న, ప్రస్తుత ప్రైవేట్ సైడింగ్స్, టెర్మినల్స్ కూడా గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌గా మార్చబడుతాయని, గుంతకల్ డివిజన్‌లోని నక్కనదొడ్డి స్టేషన్ వద్ద మెస్సర్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి నూతన సైడిరగ్‌ను గతి శక్తి మల్టీ మోడల్ కార్గో లిమిలెట్‌గా ప్రారంభించారని తెలిపారు. మెస్సర్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ వారు ఇన్వార్డ్ పెట్రోలియమ్ ఆయిల్, లుబ్రికంట్ (పీఓఎల్) రవాణా నిర్వహించడానికి అనుమతించారని పేర్కొన్నారు.
గతి శక్తి టెర్మినల్‌ల (జిసిటీ)తో ప్రయోజనాలు తెలుపుతూ.. ట్రాక్, సిగ్నల్ టెలికాం, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ మొదలగు వాటి నిర్వహణ, కార్యకలాపాలను రైల్వే చేపడుతుందని, సిబ్బంది వ్యయాన్ని (జీసీటీ వద్ద ఏర్పాటు చేసే కమర్షియల్ సిబ్బంది) రైల్వే భరిస్తుందని, జీసీటీఓ నిర్వాహకులు రవాణాదారు, పొందేవారు అయిన పక్షంలో కార్గోపై టెర్మినల్ చార్జీలు విధించబడవని, రైల్వే స్థలాలు కాని చోట్ల నిర్మించిన జీసీటీల వద్ద నిర్వహించబడే ప్రైవేట్ యాజమాన్య వ్యాగన్లపై ఎటువంటి చార్జీలు విధించబడవని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.