కిస్ డే: ఒక ముద్దు ఎంత ఉపయోగపడుతుందో తెలుసా?
దిశ, ఫీచర్స్: అంతర్జాతీయ ముద్దు దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటారు. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవం..Latest Telugu News
దిశ, ఫీచర్స్: అంతర్జాతీయ ముద్దు దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటారు. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవం. కాగా ఇది సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలిపేందుకు ఈ ప్రత్యేక రోజును నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదు ముద్దు అనేది హ్యూమన్ ఎమోషన్. ఎదుటివారిపై తమకున్న ప్రేమను వ్యక్తం చేయటానికి ముద్దు పెడుతుంటారు. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితులు, ఇతర బంధాల మధ్య అనోత్యను పెంచేందుకు ముద్దు ఒక అద్భుతమైన సాధనం.
మొదటిసారి 2000 సంవత్సరం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న కూడా ఈ కిస్ డే జరుపుకుంటారు. ఇక ముద్దు పెట్టుకోవడం కేవలం లైంగిక చర్య, ఇతర కార్యకలాపాలకు ముందడుగు కాదని, మానవ బంధాలను మరింత బలపరచేందుకు ఈ అనుభూతి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. దీంతోపాటు ఈ రోజున 'అంతర్జాతీయ పశుసంక్రమిత వ్యాధుల దినోత్సవం', 'అంతర్జాతీయ రేబీస్ దినోత్సవం' కూడా జరుపుకుంటారు.
ఉక్రెయిన్, రష్యా వార్‌లో మోడల్ మృతి
ఎయిర్ ఫోర్స్‌లో మరో రికార్డ్.. ఒకే యుద్ధ విమానాన్ని నడుపుతున్న తండ్రి, కూతురు