నాగ్ నవ్వుకే పడిపోయిన హీరోయిన్లు.. లిస్ట్ చెప్పేసిన హీరో సుదీప్
దిశ, సినిమా : హీరో కిచ్చా సుదీప్.. కింగ్ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించాడు.
దిశ, సినిమా : హీరో కిచ్చా సుదీప్.. కింగ్ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే 'విక్రాంత్ రోణ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నాగ్ వ్యక్తిత్వానికి ఎప్పుడో ఫ్యాన్ అయిపోయానని చెప్పాడు సుదీప్. ఆయన జెన్యూన్ స్మైల్‌కు పురుషులు కూడా ఫిదా అవుతుంటే, ఇప్పటికే ఎందరు హీరోయిన్లు పడిపోయి ఉంటారో చెప్పలేమని అభిప్రాయపడ్డాడు. తను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా నాగార్జున హీరోగా వచ్చిన 'రాముడు భీముడు' అని.. ఆ తర్వాత 'శివ' సినిమా చూసి హీరోగా ఫీల్ అయిపోయామని చెప్పాడు. సైకిల్ షాప్స్‌కు వెళ్లి చైన్‌లు కొనుక్కుని బ్యాగ్‌లో పెట్టుకోవడం ప్రారంభించామని ఆ మెమొరీస్ గుర్తుచేసుకున్నాడు సుదీప్.