జెండర్ న్యూట్రల్ కోసం.. 'సిట్ ఆన్ ల్యాప్' ప్రొటెస్ట్ చేసిన విద్యార్థులు!

దిశ, ఫీచర్స్ : కేరళలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ త్రివేండ్రం (CET) సమీపంలోని బస్‌స్టాప్ ఆ కళాశాల విద్యార్థులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి.

Update: 2022-07-22 07:39 GMT

దిశ, ఫీచర్స్ : కేరళలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ త్రివేండ్రం (CET) సమీపంలోని బస్‌స్టాప్ ఆ కళాశాల విద్యార్థులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి. కాగా స్నేహితులంతా అక్కడకు చేరి హ్యాంగవుట్ అవుతుంటారు. కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఎంజాయ్ చేయడమనేది స్థానిక నివాసితుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం సహా పోలీసుల దాకా వెళ్లింది. దీంతో బస్‌స్టాప్‌లోని పొడవాటి స్టీల్ బెంచ్‌ను, మూడు సీట్లుగా కట్ చేసిన విద్యార్థులు.. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలను కూర్చోబెట్టుకుని 'సిట్ ఆన్ ల్యాప్ ప్రొటెస్ట్' హ్యాష్‌ట్యాగ్ పేరుతో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సీఈటీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు స్థానిక అధికారుల దృష్టిని ఆకర్షించాయి. తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ సదరు సంఘటన స్థలాన్ని సందర్శించి, వైఫై సౌకర్యంతో కూడిన కొత్త జెండర్ న్యూట్రల్ బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. కళాశాల విద్యార్థులకు మద్దతునిస్తూ, రాజేంద్రన్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో.. 'సీఈటీ దగ్గర సీటు మూడుగా కట్ చేయడం సరికాదు. ప్రగతిశీల సమాజానికి అననుకూలమైనది. మన దేశంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడంపై నిషేధం లేదు. అలా ఎవరైనా అనుకుంటే వారు ఇంకా పురాతన యుగంలో జీవిస్తున్నారని భావించాలి. ఈ అంశంపై తీవ్రంగా నిరసన తెలిపిన విద్యార్థులను నేను అభినందిస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు. కేరళ జనరల్ ఎడ్యుకేషన్ మినస్టర్వి శివన్‌కుట్టి కూడా ఫేస్‌బుక్‌లో విద్యార్థులపై ప్రశంసలు కురిపించారు.

"బస్ షెల్టర్‌ను ఆ ప్రాంతంలోని నివాసితుల సంఘం ఏర్పాటు చేసింది. అయితే విద్యార్థులంతా ఇక్కడ చాలా సమయం కలిసి గడపడం అలవాటైంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మెలిసి ఉంటే స్థానికులు కోపం తెచ్చుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ఒకటి లేదా రెండుసార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రిపూట ఎందుకు తిరుగుతున్నారంటూ పోలీసు అధికారులు విద్యార్థులను ప్రశ్నించారు. నిజానికి ఈ పరిణామం చాలా మంది పిల్లలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 'సిట్ ఆన్ ల్యాప్ ప్రొటెస్ట్' చర్యతో మేము షాక్ అయ్యాము. ప్రజలు ఇలాంటి వైఖరులు కలిగి ఉండటం చాలా బాధాకరం

- అజ్మల్ లాబేబ్, కాలేజీ యూనియన్ చైర్‌పర్సన్

Tags:    

Similar News