Agnipath: అగ్నిపథ్‌ను కేంద్రం సమీక్షించాలి : కేజ్రివాల్
Kejriwal Asks Centre to Review On Agnipath Scheme| కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని సమీక్షించాలన్ని కేంద్రాన్ని కోరారు. అగ్నిపథ్ దేశానికి, యువతకు హనికరమని అన్నారు.
న్యూఢిల్లీ: Kejriwal Asks Centre to Review On Agnipath Scheme| కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని సమీక్షించాలన్ని కేంద్రాన్ని కోరారు. అగ్నిపథ్ దేశానికి, యువతకు హనికరమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్ పథకం దేశానికి, యువతకు హానికరం. నాలుగేళ్ల తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ పిలుస్తూ ఎటువంటి పెన్షన్ అందదు. కేంద్ర ప్రభుత్వం దీనిని సమీక్షించాలి' అని అన్నారు. కేంద్రం యువతకు కేవలం నాలుగేళ్లు కాకుండా జీవితం మొత్తం సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దేశంలోని ప్రతిచోట కేంద్ర తీసుకొచ్చిన ఈ కొత్త పథకాన్ని విమర్శిస్తున్నారని చెప్పారు. యువత కోపంగా ఉన్నారని, వారి డిమాండ్లు సరైనవే అని తెలిపారు. దేశానికి ఆర్మీ గర్వకారణమని, కేవలం నాలుగేళ్లకే వారి కలలను అంకితం చేయొద్దని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం ఇప్పటికే అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.