Karthika Deepam : భర్తకు దగ్గరగా దీప.. ప్రేమ పుట్టినట్టేనా?

దీపా.. కొన్ని పనులు పిల్లల కోసం చేయాల్సిందే.. తప్పదు

Update: 2024-11-07 10:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

కార్తీక్ తన గదిలో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ‘అయ్యో అర్జెంట్‌గా మేనేజర్‌కి కాల్ చెయ్యాలి. నా ఫోన్ ఎక్కడ పెట్టా అంటూ వెతుక్కుంటూ ఉంటాడు ఏమైంది? అని అడుగుతాడు. శౌర్య హాల్లో ఆ ఫోన్ చూస్తూ ఉంటుంది. ‘ఒకవేళ శౌర్య తీసుకుందేమో ఫోన్’ అని స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.. చూసుకోకుండా దీపను గుద్దేస్తాడు. అప్పుడు ఒకరి తల ఒకరికి తగులుతుంది. అప్పుడు శౌర్య చూసి.. ‘అలా తలలు కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి .. కొమ్ములొస్తే కారు ఎక్కినప్పుడు అడ్డం వస్తాయి కదా.. మళ్లీ ఇద్దరూ గుద్దుకోవాల్సిందే’ అని పంతం పడుతుంది. దానికి దీప నో అని చెబుతుంది. కార్తీక్ ‘మీ అమ్మ ఇబ్బంది పడుతుంది’ కదా వద్దులే అన్నా కూడా వినదు.

ఇక శౌర్య మాటలకు కాంచన, అనసూయ ఇద్దరూ వచ్చి.. ‘శౌర్య కోసం ఈ చిన్న పని కూడా చేయలేవా’ అంటూ ఇద్దరూ గుద్దుకోవాల్సిందే అని అన్నట్లుగా చూస్తుంటారు. ఇక కార్తీక్ కూడా నవ్వుతూ.. ‘దీపా.. కొన్ని పనులు పిల్లల కోసం చేయాల్సిందే.. తప్పదు దానికి అందుకే ముందే సారీ చెబుతున్నాను’ అంటూ దీప తల దగ్గరకు తీసుకొస్తూ ఉంటాడు. దీప ఇబ్బందిగా తల కిందకు వంచుతుంది. ఇక తలలు గుద్దుకునే సీన్‌ని డైరెక్టర్ సూపర్ గా తీశారు. చాలా రొమాంటిక్‌గా చూపించారు. కాంచన, అనసూయ కూడా సంతోషపడతారు. శౌర్య అయితే ఆ సీన్‌ని ఫొటో తీస్తుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది. 

Read More..

Brahmamudi: ధాన్యం దగ్గరకి వెళ్లి కొత్త బట్టలు పెట్టిన కొడుకు, కోడలు

Tags:    

Similar News

టైగర్స్ @ 42..