దమ్ముంటే అఫ్ఘాన్‌లో బురఖా తీసేయండి.. హిజాబ్ ఇష్యూపై కంగన

Update: 2022-02-11 09:02 GMT

దిశ, సినిమా : కాంట్రవర్సీ కింగ్ కంగనా రనౌత్ కర్ణాటక హిజాబ్ ఇష్యూపై స్పందించింది. 1973లో ఇరాన్‌ మహిళలు ఎలా ఉండేవారు? ప్రస్తుతం ఎలా ఉన్నారంటూ రచయిత ఆనంద్ రంగనాథన్ చేసిన పోస్ట్‌‌కు కౌంటర్ ఇచ్చింది. ఆయన ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ 'మీకు ధైర్యముంటే అఫ్ఘానిస్తాన్‌‌లో బురఖా లేకుండా తిరిగి చూపించండి.. మిమ్మల్ని మీరు పంజరంలో పెట్టుకోకండి' అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఇక రంగనాథన్ తాను పోస్టు చేసిన ఫొటోలకు 'ఇరాన్‌ 1973 - ప్రస్తుతం.. యాభై ఏళ్లలో బికినీ నుంచి బుర్ఖా వరకు. చరిత్ర నుంచి నేర్చుకోని వ్యక్తులు దాన్ని పునరావృతం చేయడంలో విఫలమవుతారు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

అయితే కంగన తాజా పోస్ట్‌పై ప్రశ్నించిన సీనియర్ నటి షబానా అజ్మీ.. 'ఒకవేళ నేను తప్పు చెప్తే సరిదిద్దండి. నాకు తెలిసి అఫ్ఘానిస్తాన్ ఒక మతతత్వ రాజ్యం. ఇక నేను చివరిసారిగా చెక్ చేసినప్పుడైతే భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగానే ఉంది!!' అని పేర్కొంది.

Tags:    

Similar News