Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. రూ. 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి..!

దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి.

Update: 2024-12-20 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (America Federal Reserve) వడ్డీ రేట్లను తగ్గించడంతో నిన్న భారీ నష్టాన్ని చవిచూసిన మన మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సిగ్నల్స్ అందడం, ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో ఈ రోజు(శుక్రవారం) కూడా నష్టాలతో విలవిల్లాడాయి. దీంతో ఈ ఒక్కరోజే 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ముఖ్యంగా ఈ రోజు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఎల్&టీ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 79,335.48 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభం అయ్యింది. ఇంట్రాడేలో 79,587.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1174.46 పాయింట్ల నష్టంతో 78,041.59 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 375 పాయింట్లు క్షీణించి 23,576 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కాస్త రికవరీ అయ్యి 85.03 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీలో నెస్లే ఇండియా, టైటాన్ తప్ప మిగిలిన కంపెనీల షేర్లు లాభపడగా.. టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఎల్&టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ప్రధానంగా నష్టపోయాయి.

Tags:    

Similar News