Youtube: తప్పుదోవ పట్టించే టైటిల్, థంబ్‌నెయిల్ ఉన్న వీడియోల తొలగింపు
బ్రేకింగ్ న్యూస్ విషయంలోనూ యూట్యూబ్ ఛానెళ్లు ఇదే తరహా ధోరణిని అనుసరిస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: కేవలం వ్యూస్ పొందడం కోసమే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుదోవ పట్టించేలా థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెడుతుంటాయి. వాటిని చూసి వీడియోపై క్లిక్ చేస్తే అందులో దానికి సంబంధించిన సమాచారం ఉండదు. ఇలాంటివి సహజంగా సినిమాలు, రాజకీయ నేతలకు సంబంధించిన విషయాల్లో జరుగుతునాయి. ఇలాంటి ట్రిక్స్ వల్ల యూట్యూబ్ యూజర్లకు అనవసరంగా సమయం వృధా అవుతోంది. దీన్ని గుర్తించిన యూట్యూబ్ కఠిన చర్యలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. సాధారణ వీడియోలతో పాటు గత కొంతకాలంగా బ్రేకింగ్ న్యూస్ విషయంలోనూ యూట్యూబ్ ఛానెళ్లు ఇదే తరహా ధోరణిని అనుసరిస్తున్నాయి. క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, టైటిల్ ద్వారా యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ కఠిన నిబంధలు తీసుకొస్తామని స్పష్టం చేసింది. త్వరలో విధానాలు అమలు చేస్తామని, వీటిని అనుసరించేందుకు యూట్యూబ్ ఛానెళ్లకు తగిన సమయం ఇస్తామని అధికారిక ప్రకటనలో తెలిపింది. నిబంధనలు పాటించకపోతే తక్షణ తప్పుదోవ పట్టించే ఠంబ్‌నెయిల్ ఉన్న వీడియోలను తొలగిస్తామని, ఆ తర్వాత కూడా అదే ధోరణిలో వీడియోలను అప్‌లోడ్ చేస్తే ఛానెల్‌పై స్ట్రైక్ వేయనున్నట్టు పేర్కొంది.