DoT: సైబర్ క్రైమ్‌పై అవగాహనకు కాలర్ ట్యూన్‌.. టెల్కోలకు డీఓటీ ఆదేశాలు

ఈ కాలర్ ట్యూన్‌లు ప్రతిరోజూ 8-10 సార్లు ప్రసారం అయ్యేలా చూడాలని స్పష్టం చేసింది.

Update: 2024-12-20 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికాం విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీలు మూడు నెలల పాటు తమ సబ్‌స్క్రైబర్లకు సైబర్ క్రైమ్‌పై అవగాహన పెంచే కాలర్ ట్యూన్‌లను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలర్ ట్యూన్‌లు ప్రతిరోజూ 8-10 సార్లు ప్రసారం అయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ ట్యూన్‌లను హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) రూపొందిస్తుంది. ముందస్తు కాల్ యాడ్స్, రింగ్ టోన్ ద్వారా సైబర్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని టెలికాం విభాగం భావిస్తోంది. ఈ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. సైబర్ క్రైమ్‌కు సంబంధించిన భిన్న కాలర్ ట్యూన్‌లు మూడు నెలల పాటు వారానికొకసారి అందించనునట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రచారం ద్వారా డిజిటల్ అరెస్టుల వంటి ఆర్థిక స్కామ్‌లను కట్టడి చేయవచ్చని, దీని ద్వారా సైబర్ మోసాగాళ్ల బారిన పడి సామాన్యులు మోసపోకుండా ఉంటారని టెలికాం విభాగం వెల్లడించారు. 

Tags:    

Similar News