28 నుంచి ఏపీజీవీబీ బ్యాంకు సేవలు బంద్​

ఏపీజీవీబీ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న సందర్భంగా నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలకు అంతరాయం ఉంటుందని రీజనల్ మేనేజర్ ముక్తాపురం ఉదయ్ తెలిపారు.

Update: 2024-12-20 11:28 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : ఏపీజీవీబీ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న సందర్భంగా నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలకు అంతరాయం ఉంటుందని రీజనల్ మేనేజర్ ముక్తాపురం ఉదయ్ తెలిపారు. శుక్రవారం ఏపీజీవీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని 493 ఏపీజీవీబీ శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో విలీనం అవుతాయని చెప్పారు.

     ఈనెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు బ్యాంకు లావాదేవీలకు అంతరాయం ఉంటుందని చెప్పారు. యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలగు సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. ఏపీజీవీబీ ఖాతాదారులు ఎవరైనా ఈనెల 27 తేదీ వరకు సేవలు ఉపయోగించుకోవచ్చు అన్నారు. జనవరి నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో తిరిగి సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ మేనేజర్ సుధీర్ పాల్గొన్నారు.


Similar News