నటి ముఖం పగిలేలా కొట్టిన 'ఆయన'.. ఆమె బయటకు చెప్పుకోలేని విధంగా..
దిశ, సినిమా : ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా తన మాజీ భాగస్వామి చేతిలో అనుభవించిన గృహ హింసపై ఓపెన్ అయింది.
దిశ, సినిమా : ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా తన మాజీ భాగస్వామి చేతిలో అనుభవించిన గృహ హింసపై ఓపెన్ అయింది. ఈ మేరకు ముఖంపై గాయాలతో కూడిన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసిన నటి.. ఈ ప్రమాదానికి కారణం తన ప్రియుడే అయినప్పటికీ అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. 'ఏడాది క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. దీంతో నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. అద్దంలో చూసుకుంటే బాధతో పాటు భయమేసింది. ఆ ఫేస్‌తో బయటికి రాలేకపోయా. కానీ ఎన్నాళ్లు దాచగలనని అర్థం చేసుకుని కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చాను' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన కరువైందన్న ఆమె.. పలుమార్లు కంప్లయింట్ ఇవ్వడంతో చివరగా గృహ హింస కేసు కింద ఆ దుర్మార్గునికి ఎనిమిది నెలల జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. జుడిత్ చెమ్లా అతనితో ఒక కూతురుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.