కాలిక్యులేటర్‌తో ఆల్జిబ్రానా.. లాజిక్ చచ్చిపోయిందంటూ జాన్వీపై ట్రోలింగ్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నెట్టింట నవ్వులపాలవుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ జూలై 29న విడుదల కానుంది..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నెట్టింట నవ్వులపాలవుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'గుడ్ లక్ జెర్రీ' జూలై 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బ్యూటీ.. స్కూల్ సబ్జెక్ట్స్‌పై తలతిక్కగా మాట్లాడి విమర్శల పాలవుతోంది. ఈ మేరకు తనకు పదోతరగతి వరకూ హిస్టరీ అంటేనే ఇష్టమని, గణితం అస్సలు నచ్చేది కాదని చెప్పింది. 'నాకో విషయం అర్థం కావట్లేదు. కాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత కూడా లెక్కలు నేర్చుకునేందుకు ఎందుకు కష్టపడాలి.
మ్యాథ్స్ కోసం ఎందుకు తలలు బద్దలు కొట్టుకోవాలి. కాలిక్యులేటర్ ఉన్నాక కష్టపడి ఆల్జిబ్రాను నేర్చుకోవడంలో ప్రయోజనం ఏముంది? నిజానికి చరిత్ర, సాహిత్యం సంస్కారవంతమైన మనుషులను తయారుచేస్తాయి. గణితం మాత్రం నిదానపరుస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా 'జాన్వీ కపూర్ కాలిక్యులేటర్ ద్వారా ఆల్జిబ్రా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ లాజిక్ చచ్చిపోయింది. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో' 'లక్షల ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుందనే దానికి ఇదే రుజువు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Who is this? pic.twitter.com/ow8hvWdToh
— Abhijit Majumder (@abhijitmajumder) July 17, 2022