ధోనితో ఎలాంటి సమస్య లేదు.. మాకూ టైమ్ వస్తుంది: రవీంద్ర జడేజా
దిశ, వెబ్‌డేస్క్: చెన్నై సూపర్ - IPL-2022 csk vs pbks we will come back stronger ravindra jadeja after match loss
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ప్రస్థానం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో హ్యాట్రిక్ ఓటములతో ప్రారంభమైంది, అయితే అతను ఎలాంటి ఒత్తిడిని అనుభవించడం లేదని చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లోను ఘోర పరాజయం చవిచూసింది. మూడో మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడాడు.. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తాము ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతామని, ప్రతి మ్యాచ్‌లోనూ అనుకోని తప్పిదాలు చోటు చేసుకుంటోన్నాయని, సరిదిద్దుకుంటామని పవర్ ప్లేలో వికెట్లను పోగొట్టుకోవడం ఓటమికి కారణమైందని పేర్కొన్నాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ప్లేయరే అనడంలో సందేహాలు అక్కర్లేదని, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల్సి ఉందని చెప్పాడు.
నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌కు నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీని వదులుకోవడంతో.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు జడేజాను తమ కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ వారి మొదటి 3 గేమ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌తో ఓడిపోయింది. "కొన్ని నెలల క్రితం అతను (ధోని) నాతో చెప్పినప్పటి నుండి నేను సిద్ధమవుతున్నాను" అని కాబట్టి మానసికంగా నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. నాపై నాకు ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు.
IPL అరంగేట్రం మ్యాచ్‌లో లక్నోపై, చెన్నై 210-7ని నమోదు చేసింది, కానీ ఆ టోటల్‌ను కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో ధోనీ బౌలర్లకు సూచనలిస్తూ.. ఫీల్డ్‌లను సెట్ చేస్తూ కనిపించగా, జడేజా అవుట్‌ఫీల్డ్‌లో నిలబడి ఉన్నాడు. "ఇది అధిక స్కోరింగ్ గేమ్ డీప్ మిడ్-వికెట్ వద్ద మెరుగైన ఫీల్డర్‌ను మోహరించడం చాలా కీలకం. అక్కడ నుండి, నేను బౌలర్లతో కమ్యూనికేట్ చేయలేకపోయాను" అని జడేజా చెప్పాడు. ధోని సూచనలను అందజేయడంలో తనకు ఎటువంటి సమస్య లేదని చెప్పాడు. "అతను తన ఇన్‌పుట్‌లను ఇస్తున్నాడు. అతను చాలా అనుభవజ్ఞుడైన కెప్టెన్, మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంత గొప్ప నాయకుడిని కలిగి ఉండటం మా అదృష్టం గా భావిస్తున్నాను." అని తెలిపాడు. చెన్నై తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది.
Namma Skip's Focus is on the good part!
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2022
Press Conference 📹 👇#Yellove #WhistlePodu 🦁💛 @imjadeja