వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దిశ, వెబ్‌డెస్క్ : మరోసారి పెట్రోల్ బాదుడు మొదలైంది. పెట్రోల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : మరోసారి పెట్రోల్ బాదుడు మొదలైంది. పెట్రోల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో మనదేశంలోనూ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వరసగా రెండో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరబాద్‌లో లీటర్ పెట్రోల్ పై 91 పైసా, డీజిల్ పై 87పైసా పెరిగింది. దీంతో రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.99కు చేరగా, డీజిల్ ధర రూ. 96.35కు చేరింది. ఇక ఈ పెరిగిన ధరలతో సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏపీలో కూడా పెట్రోల్ మంట పెడుతుంది. గుంటూరు అమరావతిలో పెట్రోల్ పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.08కు చేరింది. డీజిల్ రేటు కూడా 84 పైసలు పెరిగింది. దీంతో లీటర్ డీజిల్ ధర రూ. 98.1కు చేరింది.