వేసవిలో అతిగా మామిడిపండ్లు తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు నోరూరిస్తూ ఉంటాయి.

Update: 2022-04-12 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు నోరూరిస్తుంటాయి. ఇక కొంత మందైతే మామిడిపండ్లను చాలా ఇష్టంగా తింటారు. అయితే పండ్లు తీసుకోవడం మంచిదే కానీ అతిగా తినడం వలన ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు. వేసవికాలం అంటే వేడి. ఎక్కువగా వేడి ఉండే సమయంలో మామిడి పళ్లు అతిగా తినడం వలన శరీరానికి అధిక వేడిని కలిగిస్తాయి. అంతే కాకుండా ఇది జీర్ణప్రక్రియ‌పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా అధిక వేడి వలన అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందువలన పరిమితికి మించి మామిడిపళ్లు తినడం ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. 

ఇవి కూడా చదవండి :   ప్రస్తుతం మామిడి పండ్ల ధర తెలిస్తే షాకే...!

Tags:    

Similar News