'టీఆర్ఎస్‌లో చేరనందుకే అక్రమ కేసులు పెట్టారు'

దిశ, కాప్రా : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులోని నిందితులకు మేడ్చల్ కోర్టు..latest telugu news

Update: 2022-04-01 08:58 GMT

దిశ, కాప్రా : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులోని నిందితులకు మేడ్చల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న ఏడుగురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా ప్రజల కోసం తాము పోరాటం చేస్తుంటే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమను టీఆర్ఎస్ పార్టీలో చేరమని బలవంతం చేశాడు. అందువల్లే తమపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఒక్కరి స్వార్థం అందర్ని బలిచేస్తోందని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే నిజా నిజాలు తెలుస్తాయన్నారు. 50 కోట్ల విలువైన ఈ హత్య కేసులో చేతులు మారిన విషయమై సమగ్ర విచారణ జరిగితే అసలు విషయాలు బయటపడుతాయన్నారు.

'బంగారు తెలంగాణ కాదు..అక్రమ కేసుల తెలంగాణ' : యాదగిరి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు జైలు జీవితమేమి కొత్త కాదని యాదగిరి అన్నారు. అయితే అక్రమ కేసులు పెట్టి తమను జైలుకు పంపించారన్నారు. ఈ కేసులో 23న రాఘవేంద్రరాజు కిడ్నాప్ అయితే 24న ప్రింటింగ్ ప్రెస్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న తనను చిన్న విచారణ పేరుతో ఎస్ఓటీ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని యాదగిరి తెలిపారు. అయితే తాము ఇప్పటి వరకు నగరంలోని సుచిత్ర ఎక్కడుందో తెలియదని, కేసులో ఉన్న ఏడుగురికి సుచిత్ర తెలియదన్నారు. తాము సుచిత్ర వద్దకు వచ్చామని నిరూపిస్తే.. తాను సూసైడ్ చేసుకునేందుకైనా వెనుకాడనని పేర్కొన్నాడు. ఒకవేళ పోలీసులు నిరూపించ లేకపోతే ఏమి చేస్తారని యాదగిరి ప్రశ్నించారు.

ఈ కేసులో మమ్మల్ని ఎలాంటి విచారణ చేపట్టలేదని, విచారణ పేరుతో తీసుకొచ్చి స్టిఫిన్ రవీంద్ర తమను కేసులో ఇరికించారన్నారు. అక్రమ కేసులు పెట్టాలంటే పెట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందేన్నారు. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయం తెల్చుకుంటామన్నారు. కేసులో రూ. 50 కోట్లు చేతులు మారిన విషయాన్ని నిగ్గు తేల్చాలని, ఎవరికి ఎంతెంత వాటాలు పంచారో సీబీఐ విచారణ ద్వారా వెల్లడవుతుంది అన్నారు.

Tags:    

Similar News