రేపటి తరాలకు నీరు మిగల్చగలమా?

భూమిపై మానవ మనుగడకు అవసరమైన ప్రధాన అవసరాలలో నీరు ఒకటి. నీటి వనరు లేకుండా, భూమిపై మనిషికే కాదు

Update: 2025-03-20 18:30 GMT
రేపటి తరాలకు నీరు మిగల్చగలమా?
  • whatsapp icon

భూమిపై మానవ మనుగడకు అవసరమైన ప్రధాన అవసరాలలో నీరు ఒకటి. నీటి వనరు లేకుండా, భూమిపై మనిషికే కాదు ఏ ప్రాణికి మనుగడే ఉండదు. అయితే భూమిపై కొందరు నీరు లేక అల్లాడి పోతుంటే... కొందరు మాత్రం దానిని వృథా చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం నీటి ఆదా చేయడానికి స్థిరమైన పద్ధతులు అవసరం. నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదిన ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకా రం ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు లేకుండా మనుగడ సాగిస్తున్నారు.

నీటి సంరక్షణ పాటించకపోతే..

ఇజ్రాయెల్ దేశంలో 60% ఎడారి ఉంది. దీంతో ఆ దేశంలో నీటి వనరు కొరత ఎక్కువ. కానీ ఇజ్రాయెల్‌లో దాదాపు 50 శాతం మురుగునీటిని రీ సైకిల్ చేసి పునర్వినియోగం చేస్తూ నీటి సంక్షోభాన్ని అధిగమించింది. 150కి పైగా దేశాలు ఇప్పుడు నీటి నిర్వహణ రంగాలలో ఇజ్రాయెల్ నమూనాగా చేసుకొని వారి దేశాలలో నీటి సమస్య నుంచి శాశ్వత విముక్తికి ప్రణాళికలను చేసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం సైతం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ శక్తి అభియాన్ ప్రారంభించింది. ఇది క్షేత్ర స్థాయిలో నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్దేశించింది. నీటి సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం, నిర్వహణ, వివిధ సంప్రదాయ జలవనరుల, చెరువుల పునరుద్ధరణ, బోరు బావుల పునర్వినియోగం, రీఛార్జి, వాటర్ షెడ్ అభివృద్ధి ముమ్మర అడవుల పెంపకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ఆలమించకపోతే, రాబోయే కొన్నేళ్లలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరో నగరాలలో భూగర్భ జలాలు అడగంటి పోతాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిని నివారించడానికి ఏకైక పరిష్కారం, నీటి సంరక్షణ ఉన్న అన్ని పద్ధతులను అవలంబించడం.

వ్యవసాయ వినియోగానికే ఎక్కువ..

రాష్ట్రంలో లక్షకు పైచిలుకు ఉన్న బోర్లు, బావుల కింద దాదాపు రెండు లక్షల ఎకరాలలో వరి సాగవుతున్నట్లు అంచనా.ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు అవుతుండడంతో సాగునీటి అవసరం పెరిగింది. ప్రకృతికి అనుగుణమైన సుస్థిర వ్యవసాయం పద్ధతులను అనుసరించడం ద్వారా 50% సాగునీటి అవసరాలను క్షేత్రస్థాయిలో తగ్గించవచ్చని తేల్చిచెప్తున్నా పాటించడం లేదు. దూరదృష్టితో ప్రతి నీటి బొట్టును సమర్ధవంతంగా వినియోగం చేసుకునేందుకు ఇప్ప టి నుంచే బహుముఖ వ్యూహాలను రచించాలి.

ఎంత అవసరమో అంతే వాడుకోవాలి!

ఎండలు మరింత ముదిరితే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే పంటలకు ఎంత అవసరమో అంతవరకు నీటిని వినియోగించుకోవాలి. ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువ మంది రైతులు ఆకర్షితులు అవ్వాలి.. రసాయనాలు లేకుండా పండించిన ఆహార ఉత్పత్తులను సమర్థవంతంగా వినియోగం అయ్యేటట్లు చూడాలి.

(నేడు ప్రపంచ జల దినోత్సవం)

డాక్టర్ ముసిని వెంకటేశ్వర్లు

99892 95635

Tags:    

Similar News