Yoga: ఏకాగ్రత పెంచే వీరాసనము ఎలా వేయాలి?
దిశ, ఫీచర్స్: మొదటగా వజ్రాసనములో కూర్చోవాలి. తర్వాత కుడి మోకాలిని ఎడమ మోకాలి పైన ఉంచాలి.
దిశ, ఫీచర్స్: Yoga| మొదటగా వజ్రాసనములో కూర్చోవాలి. తర్వాత కుడి మోకాలిని ఎడమ మోకాలి పైన ఉంచాలి. కుడి పాదం నేలకు తాకేలా చూసుకోవాలి. కుడి మోచేతిని కుడి మోకాలు మీద పెట్టి కుడి అరచేతితో చుబుకాన్ని పట్టుకోవాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. ఈ సమయంలో వెన్నెముక, తల నిటారుగా ఉంచాలి. తర్వాత శరీరం కదలకుండా ఈ ఆసనంలో రెండు నిమిషాలు ఉండి, తిరిగి కాలు మార్చి పైన చెప్పిన విధంగా చేయాలి. అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత పూర్వ స్థితికి చేరుకుని రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు..
* ఏకాగ్రత పెరుగుతుంది.
* ఒత్తిడిని తగ్గిస్తుంది.
* మూత్ర పిండాలు, కాలేయం, ఉదరభాగాలకు మేలు చేస్తుంది.
* వెన్నుముక, మోకాళ్లు, తొడలకు మంచి వ్యాయామం.