యోగ దినోత్సవం ఎలా వచ్చింది?

దిశ, ఫీచర్:2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదన చేయగా..Latest Telugu News

Update: 2022-06-21 05:57 GMT

దిశ, ఫీచర్: అంతర్జాతీయ సంగీత దినోత్సవం(వరల్డ్ మ్యూజిక్ డే) జూన్ 21న జరుపుకుంటారు. 1982లో మొదటిసారిగా ఫ్రాన్స్‌లో మొదలవగా.. సృష్టిలో సంగీతానికున్న అద్వితీయ స్థానాన్ని చాటిచెప్పేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక సంగీతంలోనే కావాల్సిన శక్తి, రక్తి, భక్తి దొరుకుతుందని.. మనిషి విశ్వజనీనంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే వుందన్నది నిర్వివాదాంశం. కాగా మానవుల సర్వసామాన్య భాషగా పేరొందిన మ్యూజిక్.. ఎలాంటి ఎల్లలూ లేకుండా ప్రపంచమంతా స్వైర విహారం చేస్తుందన్న బలమై వాదన చెలామణిలో ఉంది.

ఇదేకాక ఈ ఈ రోజున 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' కూడా జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదన చేయగా.. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. చివరగా ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఉగాండా దేశాల్లో నేడు 'తండ్రుల దినోత్సవం' జరుపుకుంటారు.


Similar News