గచ్చిబౌలి డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ..
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో రూ.28 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే ఎస్టీపీ నిర్మాణ పనులను, నల్లగండ్ల హుడా కాలనీలో థీమ్ పార్క్ ను, నవోదయ కాలనీ డ్రైనేజి సమస్యను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పరిశీలించారు.
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో రూ.28 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే ఎస్టీపీ నిర్మాణ పనులను, నల్లగండ్ల హుడా కాలనీలో థీమ్ పార్క్ ను, నవోదయ కాలనీ డ్రైనేజి సమస్యను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కల్పించడం ధ్యేయమని, అందులోభాగంగా నల్లగండ్ల హుడా కాలనీ వద్ద 10.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.28 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఎస్టీపీ నిర్మాణం చేపట్టామని తెలిపారు.
ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. నల్లగండ్ల హుడా కాలనీలో గల థీమ్ పార్క్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని, ప్రజలకు స్వచ్చమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని పిల్లలకు, వృద్ధులకు, కాలనీ వాసులకు సేద తీరడానికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. నవోదయ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు డీఈ విశాలాక్షి, ఏఈ రషీద్, జలమండలి మేనేజర్లు అభిషేక్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.