HN Cube: ఐదు మూవీస్‌తో టాలీవుడ్‌లో మరో కొత్త ప్రొడక్షన్‌ సిద్దం..

కొత్త కంటెంట్‌లను అందించేందుకు టాలీవుడ్ మేకర్లు ప్రయత్నిస్తున్నారు.

Update: 2024-10-10 14:19 GMT

దిశ, సినిమా: కొత్త కంటెంట్‌లను అందించేందుకు టాలీవుడ్ (Tollywood) మేకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్ఎన్ క్యూబ్ (HN Cube) ప్రొడక్షన్‌ అనే కొత్త సంస్థ టాలీవుడ్‌లోకి వచ్చింది. హెచ్ఎన్ క్యూబ్ ప్రొడక్షన్‌ లోగో, మోషన్ పోస్టర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి చేతుల మీదుగా ఈ లోగోను లాంచ్ చేయించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ప్రస్తుతం ఐదు చిత్రాలు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాయి. హిమనంద గజా సమర్పణలో రామ్ నందా దర్శక, నిర్మాతగా హెచ్ఎన్ క్యూబ్ (HN Cube) ప్రొడక్షన్‌లో వరుసగా ఐదు చిత్రాలు రాబోతోన్నాయి. ఇక ఈ కొత్త ప్రొడక్షన్ (Production) లాంచ్ అనంతరం.. వ్యాపార వేత్త మహేష్ రెడ్డి (Mahesh Reddy) మాట్లాడుతూ.. ‘రామ్ నందాతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన ఇలా సినిమాల్లోకి రావడం, ఒకే సారి ఇలా ఐదు చిత్రాలు నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ఆయనకు మంచి సక్సెస్ దక్కాలి’ అని అన్నారు.


Similar News