TRAI: పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం.. త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ట్రాయ్

భారతదేశంలో టెలికం కంపెనీల(Telecom companies) ఆదాయం గణనీయంగా పెరిగింది.

Update: 2024-10-10 16:27 GMT

దిశ, వెబ్‌డెస్క్:భారతదేశంలో టెలికం కంపెనీల(Telecom companies) ఆదాయం గణనీయంగా పెరిగింది.టెలికం రంగంకు సంబంధించి త్రైమాసిక ఫలితాలను(Quarterly Results) టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) వెల్లడించింది. ఈ త్రైమాసికంలో టెలికం రంగం స్థూల ఆదాయం(Gross Income) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉందని , గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆదాయం 7.51 శాతం పెరిగిందని ట్రాయ్ తెలిపింది. ఇక జూన్ తో ముగిసిన త్రైమాసిక ఆదాయంలో ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం(Average Monthly Income) 8 శాతం పెరిగినట్లు పేర్కొంది .ఈ ఏడాది మార్చి నాటికి సింగిల్ యూజర్ నెలవారీ సగటు ఆదాయం రూ. 153.54 ఉండగా, జూన్ ముగిసే సరికి రూ. 157.45గా ఉందని తెలిపింది. అలాగే టెలిఫోన్ చందాదారుల సంఖ్య మునుపటి త్రైమాసికంలో 1,199.28 మిలియన్ల నుండి 1,205.64 మిలియన్లకు పెరిగింది. ఇది 0.53 శాతం వృద్ధిని నమోదు చేసింది. వైర్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. లాస్ట్ ఇయర్ జూన్ నాటి త్రైమాసికంతో పోలిస్తే 15.81 శాతం పెరిగింది. ఇక పల్లెల్లో టెలికం వినియోగం 59.65 శాతం నుంచి 59.65 శాతానికి పెరగ్గా, పట్టణాల్లో 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది.


Similar News