Alert For Microsoft Edge Users: వెంటనే బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్

గత కొంత కాలంగా బ్రౌజర్(Browser)లలో అనేక సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-10 15:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా బ్రౌజర్(Browser)లలో అనేక సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వంCentral Govt యూజర్లను ఎప్పటికప్పుడు అప్రపత్తం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్(Microsoft Edge) యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వాడుతున్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 129.0.2792.79 వెర్షన్(Microsoft Edge 129.0.2792.79 version)లలో అనేక భద్రతా లోపాలున్నాయని(security flaws) సైబర్‌ సెక్యూరిటీ సంస్థ “ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-in)” తెలిపింది. ఈ లోపాల నుంచి రక్షించుకోవడానికి బ్రౌజర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని లేకుంటే సైబర్ మోసగాళ్ల బారినపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. CERT-in ప్రకారం..మోజోలో తగినంత డేటా వాలిడేషన్ లేకపోవడం, బ్రౌజర్ లేఅవుట్ కంపోనెంట్(Browser Layout Component)లో ఇంటిజర్ ఓవర్ ఫ్లో(Integer overflow) వంటి లోపాలను గుర్తించారు. ఈ లోపాలను క్యాష్ చేసుకొని సైబర్ నేరగాళ్లు సెక్యూరిటీ కంట్రోల్స్(Security Controls)ను బైపాస్ చేసి ఫోన్లు, కంప్యూటర్లలో తమ సొంత కోడ్(Own Code)ను ఎంటర్ చేసి పర్సనల్ డేటాను చోరీ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. దీంతో యూజర్లు వెంటనే బ్రౌజర్లను లేటెస్ట్ వెర్షన్(Latest version)కి అప్డేట్ చేసుకోవాలని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.


Similar News