Samsung Galaxy A16 5G: 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్ డేట్స్ తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసిన శాంసంగ్.. ధర ఎంతంటే..?

దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్, శాంసంగ్(Samsung) మరో కొత్త మొబైల్ ను గ్లోబల్ మార్కెట్(Global Market)లో విడుదల చేసింది.

Update: 2024-10-08 16:01 GMT

దిశ, వెబ్‌డెస్క్:దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్, శాంసంగ్(Samsung) మరో కొత్త మొబైల్ ను గ్లోబల్ మార్కెట్(Global Market)లో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ పేరు గెలాక్సీ ఏ16 5జీ(Galaxy A16 5G). ఈ మొబైల్ లో 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్ డేట్స్(Android Updates)తో పాటు సెక్యూరిటీ ప్యాచులను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ‘ఎ’ సిరీస్ కొత్త మోడల్ ఫోన్ .. లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్, గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే 249 యురోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఇది మన ఇండియన్ కరెన్సీ లో దాదాపు(రూ. 23,000)గా ఉండనుంది. ఈ కొత్త మొబైల్ త్వరలోనే భారత మార్కెట్(Indian Market)లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే..

  • 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్ ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
  • 1080 X 2340 పిక్సల్స్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేస్తుంది
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెడ్జ్
  • IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్
  • 50 మెగా పిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరాతో వస్తుంది
  • ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వేరియంట్స్: 4 జీబీ ర్యామ్ + 128 జీబీ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ
Tags:    

Similar News