WhatsApp New feature: త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఫేక్ ఫోటోను వెంటనే గుర్తించే స్పెసిఫికేషన్

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్(Instant Messaging App) వాట్సాప్‌(WhatsApp) తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది.

Update: 2024-10-09 12:17 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్(Instant Messaging App) వాట్సాప్‌(WhatsApp) తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇన్​స్టాగ్రామ్(Instagram) తరహాలోనే అనేక ఫీచర్స్​ని వాట్సాప్​లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే వాట్సాప్‌ తాజాగా ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్(Search Images On The Web)’ అనే కొత్త ఫీచర్(New feature)ను తీసుకురాబోతుంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమకు చాట్‌లో వచ్చిన ఇమేజెస్‌(Images)ను గూగుల్‌(Google)లో వెళ్లి సెర్చ్ చేయవచ్చు.ఈ ఫీచర్‌ ద్వారా ఆ ఫొటో నిజమేనా కాదా లేక ఎడిట్ చేసిందా? అని తెలుసుకోవచ్చు. అలాగే ఫోటోను ఎక్కడి నుంచి తీసుకున్నారు? అనే సమాచారం సులభంగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ వల్ల తమ యూజర్ల గోప్యత(Users Privacy)కు ఎలాంటి ముప్పు(Threat) ఉండదని, ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్ అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి(Development) దశలో ఉందని, త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి రానుందని వెల్లడించింది. 

Tags:    

Similar News