TVS New Bike: రూ. 58,880 ధరతో కొత్త బైకును విడుదల చేసిన టీవీఎస్..మైలేజ్ 68 కి.మీ

ప్రముఖ బైక్ , స్కూటర్ తయారీ దారు సంస్థ టీవీఎస్(TVS) కు భారత మార్కెట్(Indian market)లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-07 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ బైక్, స్కూటర్ తయారీ దారు సంస్థ టీవీఎస్(TVS)కు భారత మార్కెట్(Indian market)లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.ఈ కంపెనీ బైకులు ఎక్కువ మైలేజ్‌ ఇవ్వడంతో పాటు ధరలు కూడా తక్కువ ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఎగబడి మరీ ఈ బైకులను కొనుగోలు చేస్తుంటారు.ఇదిలా ఉంటే..తాజాగా టీవీఎస్ రేడియన్ ఎడిషన్(Radian Edition)లో మరో కొత్త కలర్(New color)తో బైకును మార్కెట్లోకి విడుదల చేసింది .ఈ బైకు ఇప్పుడు బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.ఇక టాప్ రేంజ్ డీజీ డిస్క్ వేరియంట్ ధర రూ.81,394 గా ఉంది.

TVS Radeon Specifications:

టీవీఎస్ రేడియన్(TVS Radeon) లో అబ్బురపరిచే ఫీచర్లు ఉన్నాయి.USB ఛార్జింగ్ పోర్ట్, LCD స్క్రీన్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఈ బైకులో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ఉంటుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. దీనికి 109.7cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8 పిఎస్ పవర్ 8.7Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.ఇక మైలేజ్ విషయానికి వస్తే లీటర్‌కు 68kmpl మైలేజీని ఇస్తుంది.ఇవేకాక దీనిలో 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది.అలాగే టెలిస్కోపిక్ ఫోర్క్స్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లను కూడా కలిగి ఉంది.


Similar News