PAN Card : పాన్ కార్డ్‌లో వివరాలను మార్చాలనుకుంటున్నారా..అయితే ఇలా చేయండి
పాన్ కార్డు ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగపడే ID - ప్రూఫ్. ఎప్పుడో తీసుకున్న పాన్ కార్డ్‌లో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు.
దిశ, వెబ్‌డెస్క్ : పాన్ కార్డు ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగపడే ID - ప్రూఫ్. ఎప్పుడో తీసుకున్న పాన్ కార్డ్‌లో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు. దాంతో మీకు సంబందించిన అనేక పనులు పెండింగ్ లో పడిపోయి ఉండవచ్చు. అయితే ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చేసింది. మీ పాన్ కార్డ్‌లో ఏదైనా సమస్య ఉంటే, వాటిరి సరిదిద్దుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఇవన్నీ సరిదిద్దవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామా..
ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్‌తప్పుల సవరణ..
ఆన్‌లైన్లో పాన్ కార్డ్ లో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.
దీని కోసం ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.incometaxindia.gov.in) కి లాగిన్ అవ్వండి.
మీ పాన్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ చేయండి. ఇలా చేసిన తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ ఎంపికను ఎంచుకోండి.
ఇప్పుడు స్క్రీన్ పై అడిగిన అన్ని వివరాలను పూరించండి. అలాగే అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఇలా చేసిన తర్వాత ఫారమ్‌ను సమర్పించండి. దీని కోసం మీరు సుమారు రూ. 106 కరెక్షన్ ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రసీదు స్క్రీన్ పై వస్తుంది.
రసీదు పై ఇచ్చిన నెంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ ఎక్కడ, ఎప్పుడు వస్తుందో మీరు ట్రాక్ చేయవచ్చు. అంతే కాదు మీకు కావాలంటే, మీరు NSDL e-Gov పోర్టల్‌ని సందర్శించి పాన్ కార్డ్‌లో దిద్దుబాటులు చేసుకోవచ్చు.
మీరు ఆన్‌లైన్ లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే దిగువ ఇచ్చిన ప్రక్రియను అయితే సరిపోతుంది.
ఆఫ్‌లైన్లో పాన్ కార్డ్ సవరణ..
దీని కోసం మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న పాన్ సేవా కార్యాలయానికి వెళ్లాలి. ఇక్కడ మీరు పాన్ కార్డ్‌లో తప్పులు సవరణ కోసం ఫారమ్‌ను నింపాలి. ఫారమ్‌ను పూరించిన తర్వాత ఆ ఫారమ్‌కు అవసరమైన పత్రాలను జత చేయండి. పత్రాలను సరిగ్గా జత చేసిన తర్వాత ఫారమ్‌ను సమర్పించండి. దీని తర్వాత కొత్త పాన్ కార్డ్ కొద్ది రోజుల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది.