Personal loan : ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు!!
ప్రీ అప్రూవ్డ్ లోన్ కావాలా అంటూ పలు బ్యాంకుల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తుండటం చూస్తూనే ఉంటాం.
దిశ, వెబ్‌డెస్క్: ప్రీ అప్రూవ్డ్ లోన్(Pre Approved Loan) కావాలా అంటూ పలు బ్యాంకుల(Banks) నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తుండటం చూస్తూనే ఉంటాం. మరీ ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ అంటే ఏమిటి? ఏం ఏం పత్రాలు సమర్పించాలి. దీని ప్రాసెస్ ఏంటనే విషయాలపై చాలా మందికి అవగాహన లేదు. దీని గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం..
బ్యాంకు ఖాతాదారుల క్రెడిట్ హిస్టరీ(Customer credit history), ఆదాయం బ్యాంకుతో ఉన్న సంబంధాల ఆధారంగా ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఖాతాదారుడు కొన్ని ప్రమాణాలకు అర్హుడని నిర్దారించుకున్నాక.. వారికి ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ వస్తుంది. అయితే లోన్ విషయంలో, రుణగ్రహీతలు ఆర్థిక సంస్థకు దరఖాస్తు(Application) చేయడం కానీ.. ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం కానీ లేదు.
బ్యాంకు ఖాతాదారుడి ఆర్థిక వివరాలు(Financial details) అన్ని కరెక్ట్‌గా ఉంటే.. మనీ వెంటనే పంపిణీ అవుతుంది. ఏదైనా సాధారణ పర్సనల్ లోన్(Personal loan) మాదిరిగా, ప్రీ-అప్రూవ్డ్ రుణాలు అన్సెక్యూర్డ్(Unsecured). అంటే ఎటువంటి పూచీకత్తు అవసరం లేదన్నమాట. కానీ ఈ లోన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఫ్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తామంటూ ఫోన్లు, మెసేజ్‌లు వచ్చినప్పుడు క్లారిటీగా అన్ని చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ మెసేజ్ మెయిల్(Mail) కూడా రావచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ లోన్ తీసుకున్నట్లైతే.. అది మీ క్రెడిట్ స్కోర్(Credit score) పై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.