విడాకుల పుకార్లపై పెదవి విప్పిన హేమచంద్ర, శ్రావణ భార్గవి..

Latest Telugu News

Update: 2022-06-29 08:10 GMT

దిశ, సినిమా : సొసైటీలో మంచి కంటే చెడే త్వరగా వ్యాపిస్తుందని తెలిసిందే. ఇపుడు టాలీవుడ్ స్టార్ సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విషయంలోనూ అదే జరిగింది. తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువయ్యా యి. పైగా వీరిద్దరూ ఖండించకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరింది. అయితే ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన హేమచంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్ షేర్ చేశాడు. 'అనవసర, సంబంధం లేని, తెలివి తక్కువ సమాచారం.. నా ఇండిపెండెంట్ పాటల కంటే వేగంగా వ్యాపి చెందుతోంది' అని పోస్టు చేశాడు.

మరోవైపు శ్రావణ భార్గవి సైతం ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్ చానల్‌కు వ్యూస్ పెరిగాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పెరిగారు, మునుపటి కంటే ఎక్కువ పని, అదనపు ఆదాయం లభిస్తోంది. శుభ శకునం! తప్పొప్పుల సంగతి పక్కనబెడితే ఇదంతా మీడియా ఆశీర్వాదమే! అంటూ నోట్ షేర్ చేసింది. ఇక వీరిద్దరి పోస్టులను బట్టి చూస్తే.. డివోర్స్ వార్తలు ఒట్టి పుకార్లనే తెలుస్తోంది.


Similar News