YS Jagan:పరవాడ ఘటన పై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో(Parawada Pharmacy) ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో(Parawada Pharmacy) ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందులో పని చేసే 15 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. తాజాగా ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాగా పరవాడ ఫార్మా సిటీ కంపెనీలో విషవాయువులు లీకై ఒకరు మరణించారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కఠిన చర్యలుంటాయి అని ఆదేశాలిచ్చినా కంపెనీలు నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు