OTT: ఓటీటీలోకి రానున్న గోపిచంద్ కొత్త సినిమా

డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా విశ్వం.

Update: 2024-10-15 08:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా విశ్వం. మొదటి రోజు మొదటి షో నుంచి ఈ మూవీ పాజిటివ్‌ టాక్ తో రన్ అవుతుంది. మూవీలో కామెడీ బాగా పడిందని, థియేటర్ నుంచి బయటకొచ్చిన వారు కామెడీఎంటర్టైనర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మాస్ మాహారాజా రవితేజతో 2018లో ఓ సినిమా తీసాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని విశ్వం తెరకెక్కించాడు. నిజం చెప్పాలంటే శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ నార్మల్ గానే ఉన్నా కామెడీ ఎక్కువ ఉండటంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా పండుగ కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగానే వసూలు చేసింది.

ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా బాగానే అమ్ముడుపోయింది. అయితే, దీపావళి పండుగకు ఓటీటీలో రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తున్నారట. అక్టోబర్ 29న ఈ మూవీ అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News