రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 97 స్పెషల్ ట్రైన్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రెండు రూట్లలో 97 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది. అందులో ఇకటి కాకినాడ - లింగంపల్లి - కాకినాడ మధ్య జూలై 1 నుంచి అక్టోబర్ 1 వరకు (80) ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ - జైపూర్ - హైదరాబాద్ మధ్య జూలై 1నుండి ఆగస్ట్ 28 వరకు (17) స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.