డ్రగ్స్ విక్రేతల కోడ్స్ ఇవ్వే.. బయటకొస్తున్న విస్తుగొలిపే వాస్తవాలు
మాదక ద్రవ్యాల విక్రయాలకు ఆన్లైన్ఈజీ ప్రాసెస్‌గా మారింది. కేవలం ఒకే మెస్సెజ్‌తో కావాల్సిన వాళ్లందరికీ సమాచారం వెళ్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : మాదక ద్రవ్యాల విక్రయాలకు ఆన్లైన్ఈజీ ప్రాసెస్‌గా మారింది. కేవలం ఒకే మెస్సెజ్‌తో కావాల్సిన వాళ్లందరికీ సమాచారం వెళ్తోంది. దీంతో డ్రగ్స్ఈజీగా లభ్యమవుతోంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది డ్రగ్విక్రేతలు రాజధానిలో మకాం వేశారు. వీరిలో కొంతమంది ఏపీ నుంచి, మరికొంత మంది గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నారు. మరోవైపు పబ్‌ల్లో డ్రగ్స్ విక్రయాలు రూఢీ అయ్యాయి. పబ్మేనేజర్దగ్గరే కొకైన్ప్యాకెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇట్స్అవైలెబుల్
ఒకప్పటి డ్రగ్స్వినియోగదారులు ఇప్పుడు వ్యాపారస్తులుగా మారిన విషయం బయటకు వచ్చింది. ఇలా డ్రగ్స్ తీసుకునే వారందరికీ సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు మెయింటెన్ చేస్తున్నట్లు తేలింది. ఈ గ్రూపులకు విక్రేతలే అడ్మిన్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకే సమాచారం.. కావాల్సిన వాళ్లందరికీ క్షణాల్లో పంపిస్తున్నారు. 'హాయ్.. ఇట్స్ అవైలెబుల్' అనే సమాచారంతో తమకు కావాల్సిన మత్తు వచ్చిందని డ్రగ్స్ వాడుతున్న వారంతా క్షణాల్లో తీసుకుంటున్నారు. అంతేకాకుండా పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేసేవారు కూడా ప్రత్యేక కోడ్‌ను వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్లు ఇలా సోషల్ మీడియాలో సమాచారం ఇవ్వకుండా.. కేవలం ఒకే స్టేటస్‌తో సమగ్ర సమాచారం పంపిస్తున్నట్లు తేలింది. పబ్‌లకు డ్రగ్స్తెచ్చే వారు కేవలం తమ వాట్సాప్స్టేటస్లో సదరు డ్రగ్‌కు సంబంధించిన ఒక చిన్న క్లూను కొంత సమయం పెట్టుకుంటారు. ఆ స్టేటస్‌ను చూసి, అందుబాటులో ఉన్న డ్రగ్‌ను కొనుగోలు చేసేందుకు పబ్యజమానులు సంబంధిత ప్లేస్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా వీకెండ్‌లో మాత్రం పబ్‌లకు ఖచ్చితంగా కొంత డ్రగ్‌ను ఇచ్చి వెళ్తున్నట్లు గుర్తించారు.
పబ్ మేనేజర్ దగ్గరే కొకైన్
బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పలు విషయాలను వెల్లడిస్తూ బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు. పబ్ మేనేజర్దగ్గరే కొకైన్ ప్యాకెట్లు అమ్మకానికి పెట్టినట్లు తేల్చారు. హోటళ్లలో బిల్కౌంటర్దగ్గర సోంపు వంటివి ఎంత ఈజీగా పెడుతారో.. అంతే ఈజీగా పబ్మేనేజర్ దగ్గర కొకైన్గ్రాము, అరగ్రాము ప్యాకెట్లను అందుబాటులో పెడుతున్నారు. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. వీకెండ్ మాత్రమే కాకుండా ప్రత్యేకమైన ఫంక్షన్లకు కూడా వీళ్లు సరఫరా చేస్తున్నారని, ఇక ఫుడింగ్మింక్పబ్లో ప్రతిరోజూ 24 గంటలూ మద్యం, డ్రగ్ విక్రయిస్తున్నట్టు పోలీసులు రిపోర్ట్‌లో స్పష్టం చేశారు.
పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి సందర్భంగా మేనేజర్ముందున్న ట్రేలలో స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్ తో పాటుగా కొకైన్ప్యాకెట్లను సైతం పోలీసులు పట్టుకున్నారు. ముందుగా వాటిని అనుమానస్పద ప్యాకెట్లు అనుకున్నా.. ఆ తర్వతా పరీక్షించడంతో కొకైన్ గా తేలింది. 4.6 గ్రాముల కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. మేనేజర్ దగ్గర ఉన్న ల్యాప్ టాప్, ప్రింటర్, వేయింగ్ మిషన్‌తో పాటు ప్యాకింగ్ మెటీరియల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ల్యాప్‌టాప్‌లో ఇంకా చాలా సమాచారం ఉందని పోలీసులు చెప్పుతున్నారు. ఇవన్నీ పబ్ మేనేజర్ అనిల్ పర్యవేక్షణలో ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దాడి చేసిన రోజున అనిల్ ఇచ్చిన సమాచారంతో పబ్ నిర్వాహకుడు అభిషేక్ ను పిలిపించామని, ఇద్దరినీ ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి వాళ్ల వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నామని, ఈ మొబైల్ ఫోన్లలో చాలా మెస్సెజ్లో అప్పటికే డిలీట్ చేశారని పేర్కొన్నారు.
అయితే ఈ పబ్‌కు మాజీ ఎంపీ అల్లుడు కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి వాళ్ల పైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక పబ్‌లోకి వెళ్లేందుకు పామ్ అనే యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్లనే అనుమతించారని, రూ.50 వేల దరఖాస్తు ఫీజుతో ఫామ్యాప్కు లాగిన్ అవుతారని, ఇదంతా అభిషేక్ నేతృత్వంలోనే జరుగుతుందని వివరించారు. డ్రగ్స్‌సరఫరా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా, ఎవరు తెస్తున్నారనే అంశాలను బయటకు రావాలంటే పబ్మేనేజర్ అనిల్, యజమాని అభిషేక్ ను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
అటు అరకు టూ హైదరాబాద్
ఇక ఇటీవల డ్రగ్‌కు బానిసై మరణించిన బీటెక్విద్యార్థి కేసులోనూ పోలీసులకు చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ కేసులో డ్రగ్స్ సప్లయర్ నాగేశ్వర్‌రావు, లక్ష్మీపతిని అరెస్ట్ చేశారు. నిందితులు గంజాయి, హాష్ ఆయిల్ అమ్ముతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అరకు నుంచి యాష్ గంజాయిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అరకులో గంజాయి విక్రయించే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లక్ష్మీపతి కూడా ఏపీలోని విశాఖ ఏజెన్సీలో పోలీసులకు చిక్కాడు. ఇతడికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నది అరకు మండలం లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్ అని గుర్తించారు.
అంతేకాకుండా లక్ష్మీపతి ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయిని అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరకులో నగేష్నుంచి లక్ష్మీపతి కిలో గంజాయిని రూ.50 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కిలో రూ.6 లక్షలకు అమ్ముతున్నారని, గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి అమ్ముతున్నారని, 80 మందికి రెగ్యులర్‌గా గంజాయి సప్లై చేస్తున్నట్లు తేలింది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఒడిశాలో 14 మంది, తమిళనాడులో 13, కర్ణాటకలో 7, ముంబైలో నలుగురు డ్రగ్ పెడ్లర్లు ఉన్నారని విచారణలో తేలింది.