పురాతన కోటలో ఘోస్ట్ హంటర్లు.. అక్కడ రికార్డైన మాటలెవరివి..?! (వీడియో)
అక్కడ ఓ ఆడ దెయ్యం తిరుగుతుందని విన్నారు. Ghost hunters on spooky trip inside dark castle in England
దిశ, వెబ్‌డెస్క్ః దెయ్యాల్ని, ఆత్మల్ని కొందరు నమ్మరు. మనిషి ఆలోచన ప్రాణం ఉన్నంత వరకేనని, చనిపోయిన శరీరానికి భౌతికంగా రూపం ఉంటుంది కానీ ఆలోచనకు రూపం ఉండదనీ అంటారు. మరి చనిపోయిన మనిషి ఆలోచన (ఆత్మ) ఏమౌతుంది..?! అదే, మనం నిద్రపోతున్నప్పుడు కలలుగనే ఆ ఆత్మ సంగతేంటి..? అర్థరాత్రి, చిమ్మ చీకట్లో ఒంటరిగా అడవి దారిన వెళ్తుంటే.. ఓ పాడబడిన బంగ్లాను దాటుతుంటే.. రోడ్డుపైన కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించకపోతే.. కొందరికి చాలా భయమేస్తుంది. ఇంకొందరికి భయం కాకపోయినా కాస్త బెరుకుగా అనిపిస్తుంది. అయితే, ఇదంతా మన ఆత్మలో దాగున్న భయమేనా..? అలాంటి భయానక ప్రాంతాలకే వీళ్లు వెళతారు. యార్క్‌షైర్‌కు చెందిన WAH పారానార్మల్ ఘోస్ట్ హంటర్లు.. దెయ్యాలను వేటాడమే వీళ్ల పని! ఇంగ్లాండ్‌లో ఉన్న చారిత్రాత్మకమైన స్పోఫోర్త్ కోటను ఇటీవల సందర్శించారు వీళ్లు. అయితే, దానికి ముందు అక్కడ ఓ ఆడ దెయ్యం తిరుగుతుందని విన్నారు.
నార్త్ యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న స్పోఫోర్త్ కాజిల్ 13వ శతాబ్దంలో నిర్మించిన కోట. ఈ దెయ్యాల వేటగాళ్ల బృందం కోట వద్దకు చేరుకుని, వాళ్లు విన్నది ఎంత వరకూ నిజమో అన్వేషించడానికి, దాన్ని నిర్ధారించడానికి పూనుకున్నారు. ఈ కోటలో ఒక స్త్రీ నీలం రంగుతో తిరుగుతుందని అక్కడి స్థానికులు అంటుంటారు. యార్క్‌షైర్ లైవ్ ప్రకారం, ఆండీ పొలార్డ్, వెండీ వైట్‌హౌస్, హేలీ వైట్హౌస్ల బృందం ఆ కోటలో ఏవో పారానార్మల్ కార్యకలాపాలను గమనించినట్లు పేర్కొన్నారు. ఇతర పారానార్మల్ ఎక్స్‌ప్లోరర్ గ్రూప్‌లతో పాటు ఈ బృందం గతంలో కోటకు వెళ్లినప్పుడు ఏవేవో వింత శబ్దాలు విన్నట్లు చెప్పారు.
నవంబర్ 2021లో స్పోఫోర్త్ను సందర్శించినప్పుడు తమ అనుభవాన్ని ఆండీ పంచుకున్నారు. "మేము EVP (ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా) బిట్లు సేకరించాము. అందులో వినపడిన మాటలు ఫ్రెంచ్ భాషలా ఉన్నాయి. కానీ, రికార్డింగ్లోని వాయిస్ ఏం చెబుతుందో మేము గుర్తించలేము. మేము ఒక నెల క్రితం తిరిగి అక్కడికి వెళ్ళాము. వీడియో చివరలో ఒక మహిళ వీడ్కోలు చెప్పింది. ఇది నిజంగానే చాలా స్పష్టంగా ఉంది. దృశ్యాలను నేను నమ్మను. అది నీడ అనుకున్నాను. అయితే, ఇలాంటి ఫోటోను నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ఆడియో కూడా చాలా వింతగా ఉంది" అని పేర్కొన్నారు.