జర్నలిస్ట్ దాని కోసం ఇబ్బంది పెట్టాడంటున్న.. భారత క్రికెటర్!

Update: 2022-02-20 15:37 GMT

కోల్‌కతా: శ్రీలంక టెస్టు సిరీస్‌లో చోటు దక్కకపోవడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ఇలా ముగుస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తుంటే కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనను రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని సూచించినట్టు చెప్పాడు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో సాహాతో పాటు సీనియర్‌ క్రికెటర్లు అజింక్య రహానె, చతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మను కూడా దూరం పెట్టారు.

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు చెప్పిన మాటలను కూడా సాహా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతేడాది నవంబర్‌లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో గాయంతో బాధపడుతూనే 61 పరుగులు చేశాను. నాడు సౌరబ్ గంగూలీ వాట్సాప్‌ ద్వారా నాకు శుభాకాంక్షలు చెప్పాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పాడని, కానీ ప్రస్తుతం తనను జట్టులోకి తిరిగి తీసుకునే పరిస్థితులు లేవని ఎలా చెబుతాడని వాపోయాడు.

జర్నలిస్టుపై సాహా తీవ్ర అసహనం..


తన కెరీర్ గురించి ఆలోచనలో ఉన్న తనను ఓ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలని తెగ ఇబ్బంది పెట్టాడని సాహా పేర్కొన్నాడు. దీనికి సంబంధించి వాట్సాప్‌ మెసేజీల స్క్రీన్‌షాట్‌ బహిర్గతం చేశాడు. తాను అతనికి రిప్లై ఇవ్వక పోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని, పరోక్షంగా బెదిరించాడన్నాడు. జర్నలిజం మరీ ఇంతగా దిగజారిపోయిందని వాపోయాడు.

Tags:    

Similar News