ప్రియురాలిని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లిన ప్రియుడు.. వారం రోజులు గ్యాంగ్ రేప్
దిశ, వెబ్డెస్క్ : ప్రేమించిన అమ్మాయిని, ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రేప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
దిశ, వెబ్డెస్క్ : ప్రేమించిన అమ్మాయిని, ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రేప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. బెంగళూరు శివారులోని యలహంకకు చెందిన పదవ తరగతి చదువుతున్న అమ్మాయితో ఓ యువకుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగామారి, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. అయితే అబ్బాయికి మాత్రం బాలికపై ప్రేమకన్న తనను లొంగదీసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అది గమనించని బాలిక అతన్ని పూర్తిగా నమ్మి ఒకరోజు యువకుడితో కలిసి అతని స్నేహితుల ఇంటికి వెళ్లింది.అక్కడికి వెళ్లిన బాలిక అతని స్నేహితులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని యువకుడిని కోరినా అతను వినిపించుకోలే చివరికి నచ్చజెప్పి అక్కడే ఉండేలా చేశాడు.
ఇక ఒంటరిగా ఉన్న బాలికను మాటల్లోపెట్టి లోబరుచుకున్నాడు.. దాన్ని తన స్నేహితులతో వీడియో తీయించాడు. చివరకు తన స్నేహితులు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో చూపిస్తూ వారం రోజులు పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని తట్టుకోలేని బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.