తెలంగాణలోని ఆ గ్రామంపై కేంద్రమంత్రి ప్రశంసలు
దిశ, వెబ్‌డెస్క్: మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా శుభ్రంగా ఉండాలని ‘స్వచ్ఛభారత్’.. Latest Telugu News..
దిశ, వెబ్‌డెస్క్: మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా శుభ్రంగా ఉండాలని 'స్వచ్ఛభారత్' మిషన్ అమలు చేశారు. ఈ మిషన్ ద్వారా దేశ వ్యాప్తంగా పరిశుభ్రతను పాటిస్తున్నారు. కానీ ఈ మిషన్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. అయితే ఇటీవల తెలంగాణలోని ఓ గ్రామాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పొగిడేశారు. సాలిడ్ వేస్టేడ్ మ్యానేజ్‌మెంట్ విషయంలో తెలంగాణలోని ముఖ్రకే గ్రామం 'క్లీన్ అండ్ గ్రీన్' అన్న మాటకు నమూనాగా ఉందని అన్నారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ మీనాక్షి గడ్జెతో సమావేశం చాలా గొప్పగా సాగిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Had a great interaction with Ms Meenakshi Gadge, the Sarpanch of Mukhra-K, a remote village in #Telangana that has become a prototype for 'Clean and Green' village with a sustainable Solid Waste Management model.#SwachhBharat pic.twitter.com/TmG0icXsf8
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) March 27, 2022