ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద AIMPLB నిరసన

Telugu News, Telugu Latest News, Latest News in Telugu

Update: 2025-03-17 04:57 GMT
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద AIMPLB నిరసన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: గత ఏడాది ఆగస్టులో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ (సవరణ) బిల్లును (Waqf (Amendment) Bill) ఈ బడ్జెట్ సమావేశాలలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్‌ను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఆమోదించిన విషయం తెలిసిందే. "ముస్లిం సమాజం ఈ వక్ఫ్ సవరణ బిల్లును సమాజంపై ప్రత్యక్ష దాడిగా భావిస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వక్ఫ్ (సవరణ) బిల్లు 2024 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) నిరసన చేపట్టింది. ముందస్తుగానే ప్రకటించి మరీ ఈ నిరసన ప్రారంభించడంతో జంతర్ మంతర్ వద్దకు వేలాది మంది ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు చేరుకున్నారు.

దీంతో ఆ ప్రాంతం మొత్తం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు (Parliament sessions) జరుగుతుండటంతో అక్కడ ఏ క్షణం ఏమ్ జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అక్కడ భారీ బంధోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈ సవరణ బిల్లుపై అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం.. ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి పార్టీల నేతల మధ్య తరచూ మాట యుద్ధానికి దారితీస్తుంది.

Read More..

Drugs: కర్ణాటకలో రూ.275 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరుల అరెస్ట్ 


Similar News