shani : శని అరుదైన ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!

గ్రహాలన్నింటిలో శని ( shani graham ) గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది

Update: 2025-03-17 05:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలన్నింటిలో శని ( shani graham ) గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహాన్ని న్యాయదేవుడుగా చెబుతుంటారు. ఏ వ్యక్తులైతే అయితే జీవితంలో మంచి పనులు చేస్తారో.. వారు మంచి ఫలితాలను పొందుతారు. అదే చెడు పనులు చేస్తే దానికి తగిన విధంగా శిక్షింపబడతారు. కాబట్టి, సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. ఒక్కసారి శని దేవుడు కరుణిస్తే.. పేదవారికి డబ్బు వర్షం కురుస్తుంది. శని దేవుడిని కర్మ ఫలదాత అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. శని గ్రహం కొన్నేళ్ల తర్వాత, ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశించనుంది. ఇక అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు తిరిగి రావడానికి కూడా 30 ఏళ్ళ పాటు సమయం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కర్కాటక రాశి ( Karkataka rasi ) 

శని ప్రభావం వలన కర్కాటక రాశి వారికి శుభంగా ఉండనుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే, పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. పురోగతికి సంబంధించిన అన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలు చూస్తారు. కోర్టుకి సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. కెరీర్ కి సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. ఇన్నేళ్లు పడిన కష్టాలకు తగిన ప్రతి ఫలం పొందుతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.

తులా రాశి ( Tula rasi ) 

శని అనుగ్రహం వలన ఈ రాశి వారు కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా, కొత్తగా పెట్టుబడులకు వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే, వీరికి ప్రమోషన్ కూడా వస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News