Sukrudu: ఈ రోజు సంచారం చేయనున్న శుక్ర గ్రహం .. ఆ రాశుల వారికి లక్కీ లాటరీ తగిలినట్టే..!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. శుక్రుడు ఎవరి జాతకంలో అయితే శుభ స్థానంలో ఉంటాడో.. వారి ఎలాంటి లోటు ఉండదు. ఈ గ్రహాన్ని సంపాదన, ప్రేమ, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అలాగే, వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అందు వలన శుక్రుడును శుభంగా చెబుతుంటారు. ఈ శుక్ర గ్రహ సంచారం ప్రభావం 12 రాశుల వారి పైన చూపుతుంది. ఈ రోజు శుక్ర గ్రహం కదలడం వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మకర రాశి ( Makara rasi )
శుక్ర సంచారం వలన మకర రాశి వారికి శుభముగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలు తగ్గిపోతాయి. అంతేకాదు, మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే, ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్తారు. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అనేక ప్రయోజనాలు పొందుతారు.
వృషభ రాశి ( Vrushabha rasi )
శుక్ర సంచారం వలన వృషభ రాశి వారు లాభాలు పొందుతారు. ముఖ్యంగా, మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టె వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాత భూములకు రేట్లు పెరగడంతో మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళానుకునే వారి కల నెరవేరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.