చౌటుప్పల్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..

దిశ, చౌటుప్పల్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు - latest Telugu news

Update: 2022-03-13 17:27 GMT
చౌటుప్పల్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..
  • whatsapp icon

దిశ, చౌటుప్పల్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని భాగ్యనగర్ ఇన్సిట్యూట్ ఫ్యాకల్టీ వారితో మునుగోడు నియోజకవర్గంలో 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్‌కు పోటీపడే అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించి.. మధ్యాహ్న భోజన వసతి సౌకర్యంతో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్సులను ఎంపీడీవో కార్యాలయంలో ఐదు రోజులలో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News