Heart bypass surgery: గుండె బైపాస్ సర్జరీ అనంతరం ఈ పదార్థాలు తింటున్నారా..?
గుండె బైపాస్ సర్జరీ (Heart bypass surgery) అనంతరం హెల్తీగా ఉండాలంటే.. ఫ్యూచర్‌లో గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తకూడదంటే ఏఏ ఆహారాలు తినకూడదు.. ఏ ఆహారాలు తినాలి? అని తాజాగా నిపుణులు వెల్లడించారు.
దిశ, వెబ్‌డెస్క్: గుండె బైపాస్ సర్జరీ (Heart bypass surgery) అనంతరం హెల్తీగా ఉండాలంటే.. ఫ్యూచర్‌లో గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తకూడదంటే ఏఏ ఆహారాలు తినకూడదు.. ఏ ఆహారాలు తినాలి? అని తాజాగా నిపుణులు వెల్లడించారు. బైపాస్ సర్జరీ తర్వాత తొందరగా కోలుకోవాలంటే, హెల్తీగా ఉండే ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..
బైపాస్ సర్జరీ తర్వాత నూనె(oil) ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తినకూడదు. జిడ్డు పదార్థాల(Oily substances)కు పూర్తిగా దూరంగా ఉండాలి. తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తుల్ని(Dairy products) మాత్రమే తినాలి. లేకపోతే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్(Cholesterol in blood vessels) పేరుకుపోతుంది. ఇది గుండెకు హాని చేస్తుంది. అలాగే తీపి పదార్థాలు తినకూడదు. మిఠాయిలు(candies) గుండె ఆరోగ్యానికి మంచివి కాదు.
గుండె ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు తక్కువగా వాడడం మేలు. బైపాస్ సర్జరీ తర్వాత ఎక్కువగా సాల్ట్ తీసుకోకూడదు. మసాలా పదార్థాలు తినకూడదు. అలాగే గుండె బైపాస్ సర్జరీ తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. బ్రోకలీ(Broccoli), పొట్లకాయ(gourd), చేదు కాయల(bitter gourd) వంటి ఆకుకూరలు తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసాహారం వంటివి కొన్ని డేస్ మానుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.