ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తాం : తాండూర్ ఎమ్మెల్యే

ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు

Update: 2025-01-06 14:20 GMT

దిశ, పెద్దేముల్ : ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.12 అందిస్తామని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇదివరకే రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, 500 కే గ్యాస్ సిలిండర్, వంటి పథకాలను అమలు చేశామని ఆయన అన్నారు. ఇంకా మిగిలిన పథకాలు.. రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని పేద వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి రూ. 12 వేలు, ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లను జనవరి 26వ తారీకు నుంచి అమలు చేస్తామని అభివర్ణించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేయలా చేసిందని ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దారా సింగ్, క్రికెట్ లేటెస్ట్ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎల్ల రెడ్డి, మండల అధ్యక్షుడు గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, ఉత్తమ్ చంద్, ఆనందాచారి డివై నరసింహులు, బాబు సింగ్ శివరాం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


Similar News