జుంటుపల్లిలో కట్ట మైసమ్మ అమ్మవారికి నిప్పు పెట్టిన దుండగులు
యాలాల్ మండలం జుంటుపల్లి గ్రామంలో కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, తాండూర్ పట్టణం: యాలాల్ మండలం జుంటుపల్లి గ్రామంలో కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల డిసెంబర్ 31న ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. తాండూర్ నియోజకవర్గంలోని అతిపెద్ద ప్రాజెక్టు జుంటుపల్లి శ్రీ రాములవారి ప్రాజెక్టు, ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుకొని ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. రోజు మాదిరిగానే అమ్మవారి దర్శనానికి వెళ్లిన జుంటుపల్లి గ్రామస్తులు స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని చూసి విగ్రహం మొత్తం బూడిదల మారిపోయిందని తెలిపారు.
జుంటుపల్లి గ్రామస్తులు, యువకులు దేవాలయంలో వెళ్లి చూడగా అమ్మవారి గాజులు, దీపాంతాలు తదితర వస్తువులు బయటకు పారవేశారు. కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహానికి నిప్పు పెట్టినట్లు గ్రహించారు. ఇదే విషయంలో గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి విగ్రహ పున ప్రతిష్ట చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రధానంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఇలాంటి సంఘటనల వల్ల హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.