పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న పార్టీ కాంగ్రెస్.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

Update: 2025-01-08 09:35 GMT

దిశ, కడ్తాల్ : పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నమూనాకు భూమి పూజ చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తుందని అన్నారు. పేదల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాట గీత, నరసింహ, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ హౌసింగ్ అధికారులు, బీసీ నాయక్, సురేష్, శ్రీనివాస్, ఎంపీడీవో సుజాత, ఎమ్మార్వో ఎస్ కే ముంతాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హాన్మ నాయక్ డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బీసీసీ ప్రధాన భిక్య నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిచ్య నాయక్, ఐఎంసీ డైరెక్టర్ నరేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పోతుగంటి అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సమీపంలో ఉన్న అసంపూర్తిగా నిలిచిపోయిన ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల పై నుంచి విద్యుత్ తీగలు వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా చల్లపల్లి, వంపుగూడ గ్రామాల మీదగా వెళుతున్న మైనింగ్, క్రషర్స్ వాహనాల గ్రామాల్లో నుండి వెళ్లడం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.


Similar News