బస్సు ఎక్కుతుండగా చైన్ స్నాచింగ్...

ఆర్టీసీ బస్సులో మహిళ ఎక్కుతుండగా ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండను చైన్ స్నాచర్ ఎత్తుకెళ్లాడు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం…

Update: 2025-01-07 16:23 GMT

దిశ, పరిగి : ఆర్టీసీ బస్సులో మహిళ ఎక్కుతుండగా ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండను చైన్ స్నాచర్ ఎత్తుకెళ్లాడు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన శివలీల మంగళవారం తన తల్లి గారి ఊరు అయిన ధారూరు మండలం రాజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పరిగికి వచ్చింది. పరిగిలో ఆర్టీసీ బస్టాండ్ లో మంగళవారం రాత్రి హైదరాబాద్ బస్సు ఎక్కుతుండగా ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండను చైన్ స్నాచర్ ఎత్తుకెళ్లాడు. దీంతో ఆమె అరవడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలో వెతుకగా అప్పటికే చైన్ స్నాచర్ పరారయ్యాడు.

వెంటనే 100 డయల్ చేయగా పరిగి పోలీసులు బస్టాండ్ కు చేరుకున్నారు. వెంటనే బస్టాండ్ పరిసరాల్లో అనుమానంగా ఉన్న వారి గురించి వెతికారు. తన నల్లపూసల దండ 15 గ్రాములు ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పొట్ట కూటి కోసం హైదరాబాద్ లో పని కోసం వెళ్తున్నానని విచారం వ్యక్తం చేసింది. పక్కనే ఉన్న మరో బస్సులో ఎవ్వరిని వదలకుండా పోలీసులు తనిఖీ చేశారు. చైన్ దొరకకపోవడంతో బస్సులో పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఫింగర్ ప్రింట్ ద్వారా పాప్ లైన్ డివైస్ తో చెక్ చేశారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.


Similar News