Eye Care: కంటి కింది భాగంలో ఈ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

అనేక కారణాల వల్ల కంటి కింద భాగం ఉబ్బుతుంది. తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా ఫోన్‌ చూడటం వల్ల గానీ, వయస్సు కారణంగా ఈ సమస్యలు వస్తాయి.

Update: 2024-10-27 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘‘అనేక కారణాల వల్ల కంటి(Eye) కింద భాగం ఉబ్బుతుంది. తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా ఫోన్‌(Phone) చూడటం వల్ల గానీ, వయస్సు కారణంగా ఈ సమస్యలు వస్తాయి. కాగా కొబ్బరినూనెను కళ్లకింద రాసుకుని తేలికగా చేతులతో మసాజ్ చేయడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది’’. కొబ్బరి ఆయిల్(coconut oil) స్కిన్ ను మృదువుగా మార్చుతుంది. కంటి లోపలి భాగం నుంచి కూడా మృదువుగా చేయడంలో మేలు చేస్తుంది. దురద(itching), దద్దుర్లు, ఎరుపు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్(Skin problems) ను దూరం చేయడంలో ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరించడంలో కొబ్బరి ఆయిల్ సహాయపడుతుంది.

అలాగే కొబ్బరి నూనె జుట్టు సంరక్షణ (Skin Problems Hair Care)కోసం బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ మందంగా, పొడవుగా రావాలంటే కొబ్బరి ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇది కేవలం హెయిర్ కు మాత్రమే కాదు.. స్కిన్ సంరక్షణకు కూడా ప్రభావవంతంగా మేలు చేస్తుంది. మేకప్(Makeup) తొలగించడానికి కూడా కొబ్బరి నూనె తోడ్పడుతుంది. అలాగే ఈ ఆయిల్ తో కంటి కింద భాగంలో ప్రతిరోజూ మసాజ్ చేస్తే బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కంటి కింద భాగంలో ఆయిల్ రాస్తే కంటి సమస్యలు దూరం అవుతాయి. కొందరికి చిన్న ఏజ్‌లోనే ముడతలు వస్తాయి. కాగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. ఎన్ని బ్రాండ్ కంపెనీల ప్రొడక్ట్స్(products) యూజ్ చేసినా ఫలితం దక్కనిది.. కొబ్బరి నూనె రాస్తే ముడతలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ఆయిల్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ ను బిగుతుగా చేస్తుంది. అలాగే కొబ్బరి ఆయిల్ లో ఉండే కొల్లాజెన్ స్కిన్ ను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్(Collagen) స్కిన్ కు పోషణ అందించడంలో సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి మేలు చేస్తుంది. కాగా స్కిన్ ను మ‌ృదువుగా మార్చడంలో, కంటి కింది భాగం సమస్యలను దూరం చేయడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News