దిశ, కల్వకుర్తి : ఆర్థికంగా వెనుక బడిన వర్గాల నిరుద్యోగులు సరైన శిక్షణ పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, వారి జీవిత లక్ష్యాన్ని సాధించుకోలేక బంగారు భవిష్యత్‌ను కోల్పోతున్నారని కల్వకుర్తి ఇనిస్ట్యూట్ ఆఫ్ పోలిస్ నిర్వాహకులు కే. నవీన్ పేర్కొన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు కేఐపీ ఇనిస్ట్యూట్ ఉచితంగా ఈవెంట్స్ శిక్షణ ఇస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మా శిక్షణ కేంద్రంలో ఈవెంట్స్ ఉచితంగా ఇవ్వడం ద్వార గత 10 సం. రాలలో దాదాపు 300 మంది కానిస్టేబుల్స్, ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికయ్యరన్నారు. రాబోయే నోటిఫికేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని యువతీ, యువకులు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. 100 – 300 మీటర్ల పరుగు,లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్‌ల వాటికీ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 9848567613 సంప్రదించాలన్నారు.